HomeTelugu Trendingయానిమల్: ఆకట్టుకుంటున్న రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌

యానిమల్: ఆకట్టుకుంటున్న రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌

Animal first look
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’.. విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. ఇదే సినిమాను సందీప్ రెడ్డి.. ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టారు. దాంతో సందీప్ తదుపరి చిత్రంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి ‘యానిమల్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా ‘యానిమల్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే పోస్టర్ చాలా వైల్డ్ గా ఉంది. రణ్ బీర్ కపూర్ లుక్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి, చంకలో గొడ్డలి పెట్టుకుని సిగరెట్ కాల్చుతూ రణ్ బీర్ ఇస్తున్న ఫోజు వైల్డ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu