HomeTelugu Trendingయానిమ‌ల్ మూవీ నుంచి 'సారి దునియా' సాంగ్ రిలీజ్

యానిమ‌ల్ మూవీ నుంచి ‘సారి దునియా’ సాంగ్ రిలీజ్

Animal Song releaseAnimal Movie: బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ న‌టించిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కలెక్షన్లలో దుమ్మురేపుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా చిత్రబృందం మరో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనవసరం లేదు.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యానిమల్ మూవీ డిసెంబ‌ర్ 01న రిలీజైంది. విడుద‌ల రోజునుంచే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 22 రోజుల‌కు రూ.862 కోట్ల మార్కును దాటేసింది.

రణ్‌బీర్‌ కపూర్ ఎంట్రీ సాంగ్, బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డమే కాకుండా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ క్లైమాక్స్ సాంగ్ ‘సారి దునియా జలా దేంగే’ ఎక్స్‌టెండెడ్ వెర్ష‌న్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మూవీలో ఈ సాంగ్‌ రణ్‌బీర్‌ కపూర్, బాబీ డియోల్ ఫైట్ సీక్వెన్స్‌లో రాగా ఈ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌లో మేక‌ర్స్ కొత్త వెర్ష‌న్‌ను విడుద‌ల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu