
Rajamouli movies:
ఇండియన్ సినిమాల్లో బ్లాక్‌బస్టర్ విజయాల వెనుక ప్రధాన కారణం కథలో లాజిక్ కంటే, దర్శకుడి నమ్మకమే అని ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ అభిప్రాయపడ్డారు. తన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వివరించారు.
‘RRR’, ‘Animal’, ‘Gadar’ లాంటి భారీ విజయాలను ఉదాహరణగా తీసుకుంటూ కరణ్ జోహర్ మాట్లాడారు. ఈ చిత్రాల్లో కథలపై ఎంతో చర్చ జరిగింది. కొన్ని సన్నివేశాలు అసంభవంగా అనిపించినా, ప్రేక్షకులు అవి వండర్‌గా తీసుకున్నారు. దానికి కారణం దర్శకుల ధృడమైన నమ్మకమే. “ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ వంటి దర్శకులు తమ విజన్ మీద పూర్తిగా నమ్మకం ఉంచారు. అది ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసింది.” అని ఆయన వివరించారు.
“సినిమాలో లాజిక్ తప్పని సరి కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో మామూలుగా జరిగే దృశ్యాలు ఉండవు. కానీ, దర్శకుడు నమ్మకంగా సినిమాను నడిపిస్తే, ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారు.” అని కరణ్ తెలిపారు. “కథను ఎలా చెప్పాలో తెలుసుకున్న దర్శకులు మెగా బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నారు” అని ఆయన అన్నారు.
ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కరణ్ జోహర్ పలు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఆయన తాను స్వయంగా డైరెక్ట్ చేసే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రకటించారు. ఇది త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
ALSO READ: Chhaava సినిమాని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే