HomeTelugu Trendingయానిమల్‌ లో అత్యంత క్రూరంగా రణ్‌బీర్‌!

యానిమల్‌ లో అత్యంత క్రూరంగా రణ్‌బీర్‌!

 

Animal Movie Update 1

యానిమల్ మూవీ కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. గుల్షన్ కుమార్ మరియు టీసిరీస్ సంయుక్తంగా యానిమల్ మూవీని నిర్మిస్తున్నారు. యానిమల్ మూవీ ట్రైలర్‌ ఇంకా రిలీజ్‌ కాలేదు కానీ సౌత్, నార్త్ అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్‌లు హక్కుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారట.

ఎప్పుడోకబీర్ సింగ్ మూవీ టైమ్‌లో సందీప్‌.. అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్‌ సినిమాలో చూపిస్తా అంటూ ఓ బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. యానిమల్ ప్రీటీజర్‌తోనే ఆ స్టేట్‌మెంట్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చాడు. సినిమా రిలీజ్‌ కాకుండానే వస్తున్న లీకులు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. తాజాగా ఈ
సినిమాకు సంబంధించిన కొన్ని లీకులు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో విలన్లను నరభక్షకులుగా చూపించబోతున్నాడట. ఇప్పటివరకు హాలీవుడ్‌లో ఇలాంటి మూవీలు చాలా వచ్చాయి.

ఇండియాలోనూ ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. కానీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. యానిమల్ మూవీలో రణ్‌బీర్‌ ఫ్యామిలీ అత్యంత క్రూరంగా మనుషుల్ని చంపుతుంటారట. వాళ్లను మార్చడానికి రష్మిక విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. ఈ సినిమలో రక్తపాతం ఊహించని రేంజ్‌లో ఉంటుందని.. ప్రేక్షకులు ఊహించిన దానికంటే వంద రెట్లు ఎక్కువే ఉంటుందని సినిమాలో నటించిన వాళ్లు చెబుతున్నారు. టాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు యానిమల్‌ మూవీతో ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తాడో ఊహకు కూడా అందకుండా ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu