HomeTelugu Trendingఏకగ్రీవంగా 'మా' అధ్యక్ష ఎంపిక!

ఏకగ్రీవంగా ‘మా’ అధ్యక్ష ఎంపిక!

Maa elections 2021
‘మా’ ఎన్నికల ఇప్పడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అధ్యక్ష బరిలో ఐదుగురు పోటీ పడుతున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు ఉన్నామని ప్రకటించారు. ఇక మరో నటుడు ఓ. కల్యాణ్‌ కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. తాను ‘మా’ఎన్నికల్లో ఏ పదవికి పోటీ చేయడం లేదని, ఎవరికి మద్దతు ప్రకటించబోనని స్పష్టం చేశాడు.

మా ఎన్నికల వివాదంపై మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా కల్యాణ్‌ మాట్లాడుతూ.. 15 ఏళ్ల నుంచి ‘మా’లో అలజడి తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇక తాజాగా మరో వార్త వైరల్‌ అవుతుంది. మా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని సినీపెద్దలు నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏకగ్రీవ అధ్యక్షరాలిని ఎంపిక చేయాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేస్తారు? అంటే.. సహజనటి జయసుధకు ఆ అవకాశం దక్కనుందని తెలుస్తోంది. దీనిలో ఎంత నిజం ఉందో వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu