HomeTelugu Trendingఅంజలి 'పూచండి' ఫస్ట్ లుక్

అంజలి ‘పూచండి’ ఫస్ట్ లుక్

Anjali Poochandi First Loతెలుగమ్మాయిఅంజలి, కమెడియన్ యోగి బాబు నటిస్తున్న త‌మిళ‌ చిత్రం పూచండి. కృష్ణ‌న్ జ‌య‌రాజ్ డైరెక్షన్‌లో ఈఫాంట‌సీ కామెడీ ఎలిమెంట్స్ తెర‌కెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ ‘పూచండి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నల్ల రంగు దుస్తులు ధరించి భయపెట్టేందుకు సిద్ధం అంటున్నట్లు కళ్లు పెద్దవి చేసి అంజలి చూస్తుంది. ప్రపోజ్ చేసేందుకు వచ్చినట్లు యోగి బాబు రోజాతో ఆమె వెనుకాలే నిలుచ్చున్నాడు. ఫ‌న్నీగా, సీరియ‌స్ గా క‌నిపిస్తున్న ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన అంజలి ఎందుకు దెయ్యంగా మారింది అనేది కథ. ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu