HomeTelugu Trendingస్టార్ హీరో సరసన చేయనన్న శ్రీలీల!

స్టార్ హీరో సరసన చేయనన్న శ్రీలీల!

Sree Leela reject movie
పెళ్లి సందD సినిమాతో తెరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తర్వాత కెరీర్‌లో దూసుకెళ్తోంది. తొలి సినిమా ఆశించినంత హిట్ రాకపోయినా శ్రీలీలకు మాత్రం మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటించిన ధమాకా శ్రీలీలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది.

శ్రీలీల ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో10 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద నిర్మాణ సంస్థలు శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చి ఉన్నాయి.

వరుస ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది బడితే అది ఒప్పేసుకోవడం లేదట శ్రీలీల. ధమాకా మూవీ తర్వాత అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిందని టాక్. అయితే పుష్ప2లో ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీలను అడిగారట. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేస్తే తన కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని సున్నితంగా తిరస్కరించిందట. డేట్స్ లేకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.

శ్రీలీల ప్రస్తుతం మహేష్‌బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. వంటి స్టార్ హీరోలతో శ్రీలీల నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తుంది. బన్నీతో కలిసి శ్రీలీల ఓ యాడ్‌లో సైతం నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu