HomeTelugu Trendingమరోసారి బాలకృష్ణకు జంటగా అంజలి

మరోసారి బాలకృష్ణకు జంటగా అంజలి

10 21

హీరోయిన్‌ అంజలి ఇటు టాలీవుడ్‌ అటు కోలీవుడ్‌ల్లోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినా సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. మరిన్ని అవకాశాల కోసం బరువు కూడా తగ్గింది. తెలుగు నుంచి ఒక భారీ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అంజలికి, బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం మరోసారి వచ్చిందని అంటున్నారు.

గతంలో ఆమె బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ సినిమాలో నటించింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని తెలుస్తుంది. ఈ సినిమా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu