HomeTelugu Trendingరాజీ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత

రాజీ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత

Another Best Actress Awar

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ స‌మంత వ‌రుస ఆఫర్‌లతో దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల‌లోను త‌లుపు త‌డుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే సమంత నటిస్తోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో సమంత బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట. ఇక య‌శోద అనే పాన్ ఇండియా చిత్రంలోను సామ్ న‌టిస్తుంది.

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంతకు సౌత్‌తో పాటు నార్త్‌లోను మంచి క్రేజ్ పెరిగింది. రాజీ అనే పాత్ర‌లో స‌మంత త‌న న‌ట విశ్వ‌రూపం చూపించడంతో ఈ అమ్మ‌డికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డు ద‌క్కింది. ఆమె ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సామ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు ప్ర‌ముఖులు స‌మంత‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో స‌మంత .. మనోజ్‌ బాజ్‌ పాయ్‌కు దీటుగా రాజీ పాత్రలో న‌టించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త సమంతను చూసి అభిమానులే కాదు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu