HomeTelugu Trending'అంటే సుందరానికి' గ్లింప్స్‌ విడుదల

‘అంటే సుందరానికి’ గ్లింప్స్‌ విడుదల

Ante Sundaraniki Barthhday
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని బర్త్‌డే(ఫిబ్రవరి 24) పురస్కరించుకొని ఆయనకు మందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘అంటే సుందరానికి..’ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాని అమాయకపు బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.

అతని జీవితంలో గండాలు ఉన్నందున కుటుంబ సభ్యులు అతనితో తరచుగా హోమాలు చేయిస్తున్నారు. వరుస హోమాలతో విసిగెత్తిపోయిన నాని.. ‘బటకు వెళ్తే ద్విచక్ర వాహన గండం, నీళ్లల్లోకి వెళ్తే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చి గండం..దీనమ్మ గండం’అంటూ ఫ్యామిలీపై ఫైర్‌ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu