HomeTelugu Trendingబిగ్‌బాస్‌: నాగార్జున పారితోషికం వైరల్‌

బిగ్‌బాస్‌: నాగార్జున పారితోషికం వైరల్‌

Bigg Boss Telugu Ott Nagarj

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటిదాకా బుల్లితెరపై సందడి చేసిన బిగ్‌బాస్‌ తాజాగా టీవీకి బైబై చెప్పేసి ఓటీటీలో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అంటూ కొత్త, పాత కంటెస్టెంట్లతో గేమ్‌ మొదలుపెట్టింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న ఘనంగా ప్రారంభమైందీ షో. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జున బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాకపోతే శని, ఆది వారాల్లో కాకుండా కేవలం శనివారం మాత్రమే వ్యాఖ్యాతగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఈ క్రమంలో నాగార్జున బిగ్‌బాస్‌ ఓటీటీ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గత సీజన్‌కు పది నుంచి పన్నెండు కోట్ల దాకా రెమ్యునరేషన్‌ అందుకున్న నాగార్జున ఈసారి దాన్ని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ హోస్టింగ్‌ కోసం ఆయన దాదాపు రూ.8-9 కోట్ల మేర తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ నాగ్‌ హోస్టింగ్‌కు ఆ మాత్రం తీసుకోవడంలో తప్పే లేదంటున్నారు ఆయన అభిమానులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu