HomeTelugu Trending'అంటే సుందరానికి' మూవీ అప్డేట్‌

‘అంటే సుందరానికి’ మూవీ అప్డేట్‌

Ante sundaraniki
నెచ్యురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. తాజగా ఈమె లుక్‌ను రివీల్‌ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మార్చి 17న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి నజ్రియా లుక్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. మరి నాని, నజ్రియా కాంబినేషన్‌ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ క్లోజింగ్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu