HomeTelugu Newsఆ అమ్మాయిలకు 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'

ఆ అమ్మాయిలకు ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

14 3

నలుగురు అమ్మాయిల కథతో తెరకెక్కుతున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని’ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu