HomeTelugu NewsDisney Plus Hotstar: టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న మలయాళం సినిమాలు ఇవే!

Disney Plus Hotstar: టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న మలయాళం సినిమాలు ఇవే!

Disney Plus Hotstar

Disney Plus Hotstar: హాట్‌స్టార్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోతోపాటు బెస్ట్ మలయాళం సినిమాలు ఉన్న ఓటీటీల్లో ఇదీ ఒకటి. ఇందులో మలయాళ స్టార్‌ హీరోలు.. మోహన్ లాల్, మమ్ముట్టిలాంటి వాళ్లు నటించిన ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలతోపాటు రాబోయే మూవీస్ ఏంటో చూద్దాం..

అబ్రహం ఓజ్లర్
మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ లో జయరాం కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా గతేడాది చివర్లో రిలీజై థియేటర్లలో రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. హాట్‌స్టార్ లో ఇప్పుడీ మూవీ మలయాళ టాప్ ట్రెండింగ్స్ లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది.

నేరు
కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించాడు. ఓ చూపు లేని అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని దోషిగా తేల్చే క్రమంలో వేసే ఎత్తుగడలతో నేరు చాలా ఇంట్రెస్టింగా సాగుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

మలైకొట్టై వాలిబన్
ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన సినిమాల్లో ఈ మలైకొట్టై వాలిబన్ ఒకటి. మోహన్‌ లాక్‌ కుస్తీ వీరుడిగా నటించిన ఈ సినిమా ఈ మధ్యే హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది.

ఫలిమీ
మలయాళ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో హాట్‌స్టార్ లోకి వచ్చింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాశీ యాత్రను ఎంతో సరదాగా తెరకెక్కించే ప్రయత్నమే ఈ ఫలిమీ మూవీ.

కన్నూరు స్క్వాడ్
మమ్ముట్టి నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ కన్నూరు స్క్వాడ్. క‌న్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేష‌న్‌ను నిజంగానే చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. క్రైమ్ అంశాల‌తో పాటు వృత్తికి, వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌ల‌కు మ‌ధ్య పోలీసుల‌కు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సినిమాలో చూపించారు.

రొమాంచం
ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. తెలుగులోనూ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్న..ఈ మూవీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. దెయ్యాన్ని ఆకర్షించాలని యువకుల చేతే ఓజా బోర్డు ఆడించి వారి నుంచి హాస్యం రాబట్టుకునే ప్రయత్నం ఈ మూవీలో చేశారు.

నెయ్‌మార్
మాథ్యూ థామస్, నస్లెన్ కే గఫూర్ నటించిన ఈ సినిమా స్టోరీ ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఈ సినిమా టైటిల్ రోల్ పోషించింది ఈ కుక్కే. దీనివల్లే తమ సినిమాకు ఎంతో మంది ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చినట్లు డైరెక్టర్ సుధి మాడిసన్ చెప్పడం విశేషం.

ఇవే కాకుండా బెంగళూరు డేస్, కింగ్ ఆఫ్ కొత్త, ప్రేమమ్, భీష్మ, రోర్షాక్, బ్రో డాడీ, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ లాంటి ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు కూడా హాట్‌స్టార్ లో ఉన్నాయి. ఇక ఈ నెలలోనే ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ కూడా రాబోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu