HomeTelugu Newsమరోసారి తెరపైకి అనుష్క పెళ్లి.. వరుడు అతనే!

మరోసారి తెరపైకి అనుష్క పెళ్లి.. వరుడు అతనే!

10 14టాలీవుడ్‌లో అనుష్క పెళ్లి గురించి తరచు ఎవో వార్తలు చక్కర్లు కొడుతునే ఉంటాయి. ప్రభాస్, అనుష్క పెళ్లంట అనే వార్త చాలా కాలం సోషల్‌ మీడియాలో చల్‌చల్‌ చేశాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని వారిద్దరూ తెల్చి చెప్పేసిన … ఆ వార్త మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఓ క్రికెటర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందనే వార్త వైరల్ అయింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ ని పెళ్లాడబోతోందనే వార్త ప్రచారమైంది. ఈ వార్తలను కూడా అనుష్క కొట్టిపడేసింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ వార్త వైరల్‌ అవుతుంది.

ప్రకాశ్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందని… ఈ వార్త ముమ్మాటికీ నిజమని టాలీవుడ్ సర్కిల్స్ లో అంటున్నారు. వీరి వివాహం దాదాపు ఖరారైందని చెపుతున్నారు. అనుష్క చేతిలోని సినిమాలు పూర్తి కాగానే వీరి వివాహం జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu