HomeTelugu Trendingవోగ్ మ్యాగజైన్ కోసం 'అనుష్క' శర్మ అందాల ఆరబోత..

వోగ్ మ్యాగజైన్ కోసం ‘అనుష్క’ శర్మ అందాల ఆరబోత..

7
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి తెలుగు ఆడియన్స్‌కు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా హీరోయిన్‌గా కాకపోయినా కూడా టీమిండియా కెప్టెన్ కోహ్లీ భార్యగా అయినా అందరికీ తెలుసు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది అనుష్క. ఇండస్ట్రీలోకి రావడంతోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన ‘రబ్ నే బనాది జోడి’ సినిమాలో మెప్పించింది. అలాగే వరుస అవకాశాలతో స్టార్ హీరోలందరి సరసన నటించింది.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ‘పాతాళలోక్’ అనే వెబ్ సిరీస్ నిర్మించి హిట్ అందుకుంది అనుష్క. తాజాగా ఈ అమ్మడు వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన అందాలతో కుర్రాల గుండెలకు పిండేసింది అనుష్క. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక అనుష్క నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క ఏ సినిమాని ఓకే చేయలేదని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu