HomeTelugu Trendingహీరోయిన్‌ అనుష్కకు గాయం?

హీరోయిన్‌ అనుష్కకు గాయం?

1 25స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లో గాయపడ్డారట. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోమని అనుష్కకు సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి అనుష్క ఒప్పుకోలేదట. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోపక్క అనుష్క ‘సైలెన్స్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులోని ఓ కీలక పాత్రలో అనుష్క నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అమిత్‌ త్రివేదీ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌సేతుపతి, నయనతార, సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu