అభిమానులకు షాకిచ్చిన బిగ్‌బాస్‌.. ఈ వారం ఎలిమినేషన్‌ ఇతనే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్-2 అంతిమ దశకు చేరుకుంది. ఈ షో పూర్తి కావడానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బిగ్ బాస్-2 విన్నర్ ఎవరో అవుతారో అనే విషయం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉండగా, వీరిలో ఈరోజు ఇంటిని వదిలి పెట్టి ఎవరు బయటకు వెళ్తారనేది అందరిలో టెన్షన్ మొదలు అయ్యింది. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎవరిని ఇంట్లో ఉంచాలో..ఎవర్ని బయటకు పంపాలో నిర్ణయించాల్సింది ప్రేక్షకులకే వదిలేసిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రేక్షకులు ద్వారా తమ అభిమాన సభ్యుడికి ఓట్లు వేసి ఇంట్లో ఉండేలా చేస్తున్నారు. ఇక ఈ వారం మాత్రం అమిత్ కు తక్కువ ఓట్లు రావడం తో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ను వదిలి వెళ్లేది అమిత్ తివారి అని సమాచారం.

ప్రస్తుతం నామినేషన్‌లో అమిత్‌, రోల్ రైడా, కౌశల్‌, దీప్తి, గీతా మాధురి ఉన్నారు. దీప్తి, గీతా మాధురి, కౌశల్ కు భారీగా ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన ఇద్దరు సభ్యులు అమిత్‌, రోల్ రైడాలకి ఓటింగ్ సరళి ప్రకారం తక్కువ ఓట్లు వచ్చాయని, ఇందులో అమిత్‌కి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అమిత్ అని ఖరారు అయ్యింది.