HomeTelugu Trendingమరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో అనుష్క!

మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో అనుష్క!

2 12
టాలీవుడ్‌లో అనుష్క ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్ళు పూర్తయ్యింది. అయిన ఇప్పటికీ ఈ బ్యూటీకి ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. అందుకంటే కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. “సూపర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ వరుస ఆఫర్‌లతో ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా అరుంధతి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ఈమె ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా ఇప్పుడు అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో అనుష్కతో ‘భాగమతి’ చిత్రాన్ని తీసిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ‘రారా కృష్ణయ్య’ ఫేం పి.మహేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu