HomeTelugu Trendingసుశాంత్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

సుశాంత్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

11a 1

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు సుశాంత్‌. ఆయనకి నలుగురు అక్కలు. సోదరి మిథు సింగ్‌ రాష్ట్ర స్థాయి క్రికెటర్‌. కుటుంబంలో అందరికంటే చిన్న వాడు కావడంతో అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్‌గా ఉండే సుశాంత్‌ చదువులోనూ అందరికంటే యాక్టివ్‌గా ఉండేవారు. 2002లో కన్నతల్లి మరణం సుశాంత్‌ను మానసికంగా కృంగదీసింది. అదే ఏడాది సుశాంత్‌ కుటుంబం పట్నా నుంచి ఢిల్లీకి షిప్ట్‌ అయింది. ఏఐఈఈఈ(AIEEE)ఆయన ఆల్‌ఇండియా 7వ ర్యాంకు సాధించారు. ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు. నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాది చదవు మానేసి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షియామాక్‌ ధావర్‌ వద్ద శిష్యునిగా చేరాడు.

బుల్లితెరపై నచించడానికి ముందు పలు అవార్డు వేడుకలలో, వివిధ కార్యక్రమాల్లో డాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా మారాలనే కలతో సుశాంత్‌ ముంబైకి వచ్చాడు. ఎంతో కష్టపడి స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా కెరీర్‌లో మంచి స్టేజ్‌లో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సుశాంత్‌ ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్‌ ఇండస్త్రీ ఉలిక్కి పడింది. ఈ వార్త తమకు ఆశ్చర్యనికి గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్లు చేశారు.

సుశాంత్‌ మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్నా నుంచి విమానంలో వచ్చేందుకు సిద్దమవుతున్నారు. కూపర్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం సుశాంత్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పటికే కూపర్‌ ఆస్పత్రికి చేరుకున్న సుశాంత్‌ సోదరి.. తమ్ముడిని తలచుకుంటూ బోరున విలపించింది.

11 10

Recent Articles English

Gallery

Recent Articles Telugu