HomeTelugu Big Storiesఅప్పుడేమో పవన్.. ఇప్పుడు మాస్ మహారాజా!

అప్పుడేమో పవన్.. ఇప్పుడు మాస్ మహారాజా!

అప్పుడేమో పవన్.. ఇప్పుడు మాస్ మహారాజా!
‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. మధ్యలో రెండు సినిమాలు చేయానుకున్నా.. కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా వెంకీ, బలుపు, కృష్ణ, పవర్ వంటి చిత్రాలతో రవితేజ కెరీర్ లో హిట్స్ రావడానికి కారణమైన కోన వెంకట్ కూడా రవితేజకు కథ చెప్పాడట. బాబీ చెప్పిన కథతో సినిమా చేయాలనుకున్న మాట నిజమే కానీ.. తరువాత కోన చెప్పిన కథ ఇంకా బాగా నచ్చడంతో ఆ స్టోరీతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. దీంతో బాబీ, కోనతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సమయంలో పవన్, బాబీకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మొత్తం అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి బాబీకు తలపోటు తెప్పించాడు. ఇప్పూడు రవితేజ కూడా అలానే చేస్తున్నాడనేది ఫిల్మ్ నగర్ గానం. మరి ఈ చిత్రం రవితేజకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి

Recent Articles English

Gallery

Recent Articles Telugu