ఇక సినిమా చూడాలంటే ఆలోచించాలేమో!

ఇకపై థియేటర్ కు వెళ్ళి సినిమా చూడాలనుకునే ప్రతి ప్రేక్షకుడిపై అదనపు భారం పడనుంది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రాష్ట్రంలో ఉన్న చిన్న థియేటర్ మొదలు.. భారీ మల్టీప్లెక్స్ ల వరకు టికెట్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు మల్టీప్లెక్స్ లో రూ.150 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.200 కి చేరనుంది. మిడిల్ క్లాస్ వర్గాలకు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే ఇక భారమవ్వడం ఖాయం. ఇక సాధారణ థియేటర్ లో టికెట్ ధర రూ.120 
వరకు పెంచుకునే అవకాశాలు కల్పించారు. ఇప్పటివరకు కనీస టికెట్ ధర రూ.20 గా ఉంది. ఇప్పుడు అమాంతం దీన్ని డబుల్ చేసి రూ.40కి చేర్చారు. 
కాబట్టి దిగువ స్థాయి వర్గాలపై కూడా భారం పడనుంది. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేయాలంటే మరిన్ని ఛార్జీలు పడతాయి. థియేటర్లలో సమోసా, పాప్‌కార్న్ లాంటి ఖర్చులు ఎలానూ ఉంటాయి. పార్కింగ్ కు కూడా డబ్బులు కట్టాల్సిందే. ఇదంతా చూస్తుంటే ఇక థియేటర్ కు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతోంది. సమయం దొరికినప్పుడల్లా.. థియేటర్లకు పరుగులు తీసే సినిమా అభిమానులు ఇక ఒకటికి రెండు సార్లు తమ పాకెట్ ను తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.