HomeTelugu Reviewsఅరవింద సమేత మూవీ రివ్యూ

అరవింద సమేత మూవీ రివ్యూ

6 9జూనియర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలం నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. టీజర్‌, ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాత ఫామ్‌ను అందుకున్నాడా?

కథ: ‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు ఊళ్లను నాశనం చేస్తాయి. నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ ఈ చిత్రం.12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి(నాగబాబు) కుమారుడు హీరో (ఎన్టీఆర్‌) వీర రాఘవ రెడ్డి ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి(జగపతి బాబు) మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే హీరోయన్‌ (పూజా హెగ్డే) అరవింద తో ప్రేమలో పడతాడు. వీర రాఘవ రెడ్డి.. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు వీర రాఘవ రెడ్డి. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే కథలో అంశం.

6a

నటీనటులు : ఎన్టీఆర్‌ సినిమా అంటేనే వన్‌ మెన్‌ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్‌ పడిన కష్టం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కథనాయికగా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో పూజా ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ పరంగానూ ఈ భామా మంచి మార్కులే సాధించింది. విలన్‌ పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయాడు. లుక్స్‌ పరంగానూ భయపెట్టాడు. యంగ్ హీరో నవీన్‌ చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా, శుభలేక సుధాకర్‌, బ్రహ్మాజీలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ : త్రివిక్రమ్, ఎన్టీఆర్‌ కలయికలో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్‌. అభిమానులు తన నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే డైలాగ్స్‌, ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్‌ మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా మిస్‌ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్‌ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా.. తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్‌ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్ అలరిస్తాయి. రెండోవ భాగంలో ఎమోషనల్‌ సీన్స్‌తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది. తమన్‌ సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలతో విడుదలకు ముందే ఆకట్టుకున్న తమన్‌.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. పీఎస్‌ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో బలం‌. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

6b
హైలైట్స్
ఎన్టీఆర్ నటన
తమన్‌ సంగీతం

డ్రా బ్యాక్స్
రొటీన్‌ ప్రేమకథ

చివరిగా : భావోద్వేగాలతో ‘అర‌వింద స‌మేత వీర రాఘవుడు’
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ
నటీనటులు : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

జూనియర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలం నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు....అరవింద సమేత మూవీ రివ్యూ