HomeTelugu Newsఅర్జున్‌ కూతురు ఐశ్వర్య టాలీవుడ్‌ ఎంట్రీ..

అర్జున్‌ కూతురు ఐశ్వర్య టాలీవుడ్‌ ఎంట్రీ..

9 9
యాక్షన్ కింగ్ అర్జున్‌ కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. తమిళంలో సీనియర్ స్టార్ హీరోగా ఆయన తన జర్నీ కొనసాగిస్తున్నారు. అర్జున్ తన కూతురు ఐశ్వర్యను కొంతకాలం క్రితమే కన్నడ .. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో తన కూతురును తెలుగు తెరకి పరిచయం చేస్తానని చెప్పారు. తన దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందని అన్నారు.

ఈ రోజు ఐశ్వర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. తన కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందనీ, అందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్టు అర్జున్‌ సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu