HomeTelugu Big Storiesమహేష్‌ బాబు బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

మహేష్‌ బాబు బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన 25వ సినిమా చిత్ర యూనిట్‌కు గురువారం రాత్రి గోవాలో పార్టీ ఇస్తున్నాడని సమాచారం. సన్నిహితులకు బుధవారం రాత్రే తన ఇంట్లో అత్యంత సన్నిహితులకు పార్టీ ఇచ్చిన మహేష్ బాబు ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి గోవా వెళ్లినట్లు సమాచారం. మహార్షి ఫస్ట్‌ లుక్‌, టీజర్‌తో ఫ్యాన్‌ను ఖుషీ చేసిన ప్రిన్స్‌.. సన్నిహితులు, చిత్ర యూనిట్‌ను ఖుషి చేసేందుకు పార్టీ ఇస్తున్నాడట.

4 7

మహర్షి చిత్ర యూనిట్‌ గోవా బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ 25వ సినిమా తదుపరి షెడ్యూల్‌ను గోవాలోనే చిత్రీకరించనున్నారట. రేపటి నుంచి ఐదు రోజులపాటు షూటింగ్ నిర్వహించ నున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌‌ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu