HomeTelugu Trendingఏనుగు మూవీ ట్రైలర్

ఏనుగు మూవీ ట్రైలర్

Arun vijay priya bhavani sh

‘నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్‌ సినిమా. తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదల అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్‌ అవుతారు’ అని హీరో అరుణ్‌ విజయ్‌ అన్నారు. హరి డైరెక్షన్‌లో అరుణ్‌ విజయ్, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘యానై’. వేదిక కారన్‌పట్టి, ఎస్‌. శక్తివేల్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది.

జగన్మోహిని సమర్పణలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలని వినోదాత్మకంగా చూపిస్తూ, మంచి సందేశం ఇచ్చాం’ అన్నారు హరి. ‘మా సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారు’ అన్నారు సీహెచ్‌ సతీష్‌ కుమార్‌. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu