HomeTelugu Trendingఅమెజాన్‌ ప్రైమ్‌లో ఆర్య సినిమా

అమెజాన్‌ ప్రైమ్‌లో ఆర్య సినిమా

Arya sarpatta on amazon pri
కరోనా కారణంగా చాలా సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. మళ్లీ మొదలైనా ఇంకా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అలా త్వరలో రాబోతున్న మరో భారీ చిత్రం ‘సార్‌పట్ట’. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించిన దర్శకుడు పా.రంజిత్‌. ఆయన డైరెక్షన్‌లో ఆర్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సార్‌పట్ట’. బాక్సింగ్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జులై 22న తమిళ, తెలుగు భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు నటుడు ఆర్య ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీకోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనతో పాటు బాక్సర్లుగా నటించిన ఇతర నటులు సైతం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘సార్‌పట్ట’ ప్రపంచాన్ని చూడండి అంటూ అప్పట్లో విడుదల చేసిన వీడియో విశేషంగా ఆకట్టుకుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu