ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్టు తాజా అప్‌డేట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తాజా అప్‌డేట్ ఇచ్చాడు. అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్టు ఇప్పటికే వెల్లడించాడు వర్మ. ‘డీ కంపెనీ’ పేరుతో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 23న ట్రైలర్‌ను విడుదలచేస్తున్నట్లు వర్మ ట్విట్టర్‌లో వెల్లడించాడు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపాడు. తన లైఫ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఇందులో దావూద్ జీవితానికి సంబంధించిన బయోపిక్ మాత్రమే కాదని అంటున్నాడు. ప్రపంచంలోనే భయంకరమైన డాన్‌గా దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడో చెప్పబోతున్నట్టు తెలిపాడు.

పవన్ కల్యాణ్ తాజా మూవీ అప్‌డేట్

CLICK HERE!! For the aha Latest Updates