HomeTelugu Trendingహీరో వేణు హర్రర్ వెబ్‌ సిరీస్ 'అతిథి' టీజర్

హీరో వేణు హర్రర్ వెబ్‌ సిరీస్ ‘అతిథి’ టీజర్

Athidhi Web Series teaser

ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. హర్రర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు ‘అతిథి’ పేరును ఖ‌రారు చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఓ పురాత‌న భ‌వంతిలో ఈ హర్రర్ సిరీస్ కొనసాగ‌నుంది. వర్షంలో భ‌వంతిలోకి అడుగుపెట్టిన ఓ యువ‌తి ఈ రాత్రికి నేను ఇక్క‌డ ఉండొచ్చా అని అడగ‌టం ఆ తర్వాత రొమాన్స్, హర్రర్ సీన్‌లు ఈ టీజ‌ర్‌లో క‌నిపిస్తున్నాయి.

హర్రర్‌, రొమాన్స్‌, స‌స్పెన్స్ అంశాల‌తో ఆస‌క్తిక‌రంగా అతిథి టీజ‌ర్ సాగింది. ఈ వెబ్‌సిరీస్‌లో వేణు తొట్టెంపూడితో పాటు అవంతికా మిశ్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను వెల్ల‌డించ‌నున్నారు.

గతంలో స్వ‌యంవ‌రం, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పెళ్లాం ఊరెళితే వంటి కామెడీ సినిమాలతో హీరోగా మంచి విజ‌యాలను అందుకున్నాడు వేణు. ద‌మ్ము, చింత‌కాయ‌ల‌ర‌వితో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

2013లో రిలీజై రామాచారి మూవీ త‌ర్వాత సినిమాల‌కు లాంగ్ బ్రేక్ తీసుకున్న వేణు గ‌తేడాది ర‌వితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో వేణు న‌టించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu