HomeTelugu Trendingఅవిక గోర్‌ న్యూ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్

అవిక గోర్‌ న్యూ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్

Avika gor new movie first g

అవిక గోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగు సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చింది. ఆఫర్లు వెళ్లినా అంతగా ఆసక్తి చూపలేదు. కారణాలు ఏవైనా ఇక్కడి ఆడియన్స్ తో ఆమెకి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యతో పాటు కల్యాణ్ దేవ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అవిక పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్ ను వదిలారు. కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా అందంగా చూపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu