HomeTelugu Trendingమంగళవారం: అప్పడప్పడ తాండ్ర సాంగ్‌ వచ్చేసింది

మంగళవారం: అప్పడప్పడ తాండ్ర సాంగ్‌ వచ్చేసింది

Appadappada Thaandra from M

హీరయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’. ఈ సినిమాకి అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈ మూవీపై ఓ రెంజ్‌లో హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్​లో వేగవతం చేశారు. తాజాగా మరో మాస్ బీట్​ సాంగ్​ను రిలీజ్​ చేసింది.

అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్​లో దర్శకుడు తరుణ్ భాస్కర్​ లీడ్ రోల్ ప్లే చేశారు. నటుడు లక్ష్మణ్​తో కలిసి చిందులేశారు. గ్రామంలోని సీక్రెట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ సాగిన సాంగ్ లిరిక్స్​కు చిందులేశారు.

రాహుల్ సిప్లిగంజ్​ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. అజనీశ్ లోక్​నాథ్ సంగీతం చాలా బాగుంది. గణేశ్ లిరిక్స్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది. సినిమాలో పాయల్ రాజ్​పుత్ క్యారెక్టర్​ సస్పన్స్​గా పెట్టారు.

ఇప్పటివరకు క్లారిటీగా రివీల్ చేయలేదు. ట్రైలర్​లో మాత్రం వేధింపులకు గురైన బాధితురాలిగా మాత్రం చూపించారు. అజయ్ ఘోష్, నందిత శ్వేత, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముద్ర మీడియా, క్రియేటివ్​ వర్క్స్​ బ్యానర్​పై సినిమాను నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu