బాహు-బల్లాల బల ప్రదర్శన!

బాహుబలి2 సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బాహుబలు టీం మెంబర్స్ ప్రభాస్, రానా చండీగర్ యూనివర్సిటీని విజిట్ చేశారు. అదే సమయంలో అక్కడ బైసాఖి ఉత్సవాలు జరుగుతుండడంతో ఈ ఉత్సవాల్లో రానా, ప్రభాస్ లు సైతం పాల్గొన్నారు. బైసాఖి
ప్రత్యేకతలు ఏంటో అక్కడ యువతిని అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం.

అక్కడ స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్, రానా సమాధానాలు చెప్పారు. వారిని ఎంటర్టైన్ చేయడానికి కొందరు స్టూడెంట్స్ అడిగిన కోరిక మేరకు వారి ముందు పిడికిలి బిగించి చిన్నపాటి యుద్ధ సన్నివేశాన్ని వారి కళ్ళముందుంచారు. బైసాఖి ఉత్సవాల సమయంలో కాలేజ్ ను సందర్శించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.