
Baahubali: The Epic Release Date:
మళ్లీ ఓ మేజిక్ మొదలవుతోంది! ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ గురించి ఎవరు మర్చిపోతారు? ఇప్పుడు ఆ రెండు భాగాల్ని ఒక్కటి చేసి “బాహుబలి: ది ఎపిక్” అనే టైటిల్‌తో తిరిగి థియేటర్స్‌కి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి.
ఈ మూవీ 2025 అక్టోబర్ 31న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అధికారికంగా ఇంకా ట్రైలర్ కానీ పోస్టర్ కానీ రాలేదోచ్చినా, ఒక్క అనౌన్స్‌మెంట్‌తోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. BookMyShowలో ఒక వారం లోపే 60,000 మందికి పైగా “ఇంటరెస్ట్ షో” చేశారు. అంటే ఏ రేంజ్‌లో పాపులారిటీ ఉందో అర్థమవుతుంది కదా?
ఇంకా ఈ మూవీ రన్‌టైమ్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. 5 గంటల 27 నిమిషాలు నడుస్తుందనేది గాసిప్. అయితే నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు – “ఒక IPL మ్యాచ్ ఎంత టైం నడుస్తుందో, అదే రేంజ్‌లో ఉంటుంది” అని చెప్పారు. అంటే 3 గంటల్లోపే ఉంటుందన్నమాట.
ఫ్యాన్స్‌కి ఇది ఒక ఫెస్టివల్ లాంటి ఈవెంట్. భారీ విజువల్స్, థియేట్రికల్ మాజిక్‌కి రెడీ అయిపోవాలి. రాజమౌళి మళ్లీ తన మ్యాజిక్ చూపించబోతున్నాడు.
ఇప్పటిదాకా రెండు భాగాల్ని వేర్వేరుగా చూశాం. ఇప్పుడు వీటిని కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, భారీ స్కోర్‌తో, మరింత శక్తివంతంగా తెరమీదకి తెచ్చే ప్రయత్నం ఇది. ఫ్యామిలీతో థియేటర్‌లో చూసే టైమ్ వచ్చేస్తోంది!
ALSO READ: పెళ్లి వద్దు కానీ తల్లిని అవుతాను అంటున్న Shruti Haasan













