HomeTelugu Trendingతెలుగులోకి కన్నడ 'బడవ రాస్కెల్'

తెలుగులోకి కన్నడ ‘బడవ రాస్కెల్’

Badava rascals kannada movi
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన సినిమా ‘బడవ రాస్కెల్’. గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా కన్నడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో విడుదల కానుంది. డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

తెలుగులో పలు సినిమాలను నిర్మించి, చక్కని గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని అందిస్తుండడం విశేషం. ‘లవ్ మాక్ టేల్’ ఫేమ్ అమృత అయ్యంగార్ ‘బడవ రాస్కెల్’లో హీరోయిన్ గా నటించింది. గీత శివరాజ్ కుమార్ సమర్పణలో సావిత్రమ్మ అడవిస్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. వాసుకీ వైభవ్ సంగీతం అందించిన ‘బడవ రాస్కెల్సకు రామ్ వంశీకృష్ణ సాహిత్యం న సమకూర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu