HomeTelugu Trending'బాహుబలి’ సినిమాకి ఏడేళ్లు..

‘బాహుబలి’ సినిమాకి ఏడేళ్లు..

6 5
డైరెక్టర్‌ రాజమౌళి సృష్టించిన కళాఖండం ‘బాహుబలి’. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే బాహుబలి సంచలనం సృష్టంచింది. భారీ బడ్జెత్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకొని బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ చిత్రం. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఈ రోజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. (‘రాజ్‌ కపూర్‌ తర్వాత ప్రభాస్‌కే’)

బాహుబలి షూటింగ్‌ ప్రారంభమయ్యి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ విషయాన్ని బాహుబలి టీమ్‌ తన ట్విటర్‌లో ఖాతాలో పేర్కొంది. బాహుబలి షూటింగ్‌ 2013 జూలై 6న ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను కర్నూలులోని రాక్‌గార్డెన్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌, అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu