HomeTelugu Trendingఓటీటీలో 'అఖండ'

ఓటీటీలో ‘అఖండ’

Balakrishna akhanda movie o

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. ఇటీవలే విడైదలై ఈ సినిమా మంచి టాక్‌తో బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో మూడో చిత్రం. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నదట.. ఇక దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

కొత్త సంవంత్సరం కానుకగా అఖండ ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నదట. అఖండ డిజిటల్ హక్కులను ‘మా’ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తాన్ని ముట్టజెప్పి కొనుగోలు చేసిన ఈ చిత్రాన్ని జనవరి 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించనున్నారట.. థియేటర్లో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu