HomeTelugu Trendingబాలకృష్ణ భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

Balakrishna Bhagavant Kesar

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా రూపొందుతోంది. బాలయ్య మార్కు సినిమాగానే ఉంటుందని అనిల్ రావిపూడి ముందుగానే హింట్ ఇచ్చేశాడు. ఆయన ఫస్ట్‌లుక్ రివీల్ చేస్తూనే, సినిమాపై అంచనాలు పెంచేశాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్ కాగా ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఇంకా అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

భగవంత్ కేసరి మూవీని సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వినాయకుడి ఉత్సవాల సందర్భంగా వచ్చే పాటగా ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఆరెంజ్ కలర్ లాల్చీ వేసుకుని డ్రమ్స్ వాయిస్తూ స్టెప్పులేస్తున్న పాట తాలూకు పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. అక్టోబర్ 19న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

20230824fr64e73e87a05a3

Recent Articles English

Gallery

Recent Articles Telugu