HomeTelugu Trending'ఎన్‌బీకే 107' టీజర్‌ వచ్చేస్తుంది

‘ఎన్‌బీకే 107’ టీజర్‌ వచ్చేస్తుంది

Balakrishna Birthday Specia

నందమూరి బాలకృష్ణ హీరోగా 107వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ బ్యానర్లో నిర్మితమవుతున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది… విలన్‌గా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఆయన మాస్ విలనిజమే ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. రేపు బాలకృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ రావొచ్చని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ఈ రోజున ఇంట్రస్టింగ్ అప్ డేట్ రాబోతోందని అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్యకి అచ్చొచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలోనే రూపొందిస్తున్నాడు. బాలయ్య సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు కథలో ఉండేలా చూసుకుంటూనే, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తపడినట్టుగా అర్థమవుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu