HomeTelugu Trending'పొన్నియన్ సెల్వన్' నుండి ఐశ్వర్యారాయ్ ఫొటో లీక్‌

‘పొన్నియన్ సెల్వన్’ నుండి ఐశ్వర్యారాయ్ ఫొటో లీక్‌

Aishwarya rai

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంతో దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ నటిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. మొదటి భాగం 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పీరియడ్ డ్రామాలో విక్రమ్, జయం రవి, ప్రకాష్ రాజ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. తన రెండు పాత్రలను మణి సర్ అంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దారని కథనాలొచ్చాయి. ఇటీవల ఐష్ సహా ప్రధాన తారాగణం ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

తాజాగా పొన్నియిన్ సెల్వన్ ఆన్ లొకేషన్ నుంచి ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. లీక్ అయిన ఫొటోలో ఐష్ ఎరుపు రంగు చీరలో కనిపిస్తున్నారు. ఆ చీరకు తగ్గట్టుగానే భారీ ఆభరణాలతో అలంకరించుకుంది. ఆమె చుట్టూ చిత్రబృందం హడావుడిగా ఉన్నారు. ఇక ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. నందిని మరియు మందాకిని దేవి అనే ద్విపాత్రలతో మెప్పించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu