బాలకృష్ణ, బోయపాటి సినిమా ముహూర్తం ఆ రోజేనంట.!

ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ లోని రెండు సినిమాల తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు బాలకృష్ణ.

ఇప్పటికే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజకీయం బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. సినిమా ఎప్పుడు లాంచ్ కాబోతున్నది అన్న దానికి సమాధానం దొరికింది. ఫిబ్రవరి 22 వ తేదీన అంటే మహానాయకుడు సినిమా విడుదల రోజునే బాలకృష్ణ.. బోయపాటి సినిమా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. కథను ఇప్పటికే లాక్ చేశారు. స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట బోయపాటి.

బాలయ్య.. బోయపాటి సినిమా ప్రారంభమైన వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా.. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఏప్రిల్, మే నెలలు ఎన్నికల ఎన్నికల హడావుడి ఉంటుంది. ఎన్నికల సమయంలో బిజీగా ఉంటారు. ఎన్నికలు ముగిశాక తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.