HomeTelugu Trendingబాలకృష్ణ బోయపాటి సినిమా టైటిల్‌ ఇదేనా!

బాలకృష్ణ బోయపాటి సినిమా టైటిల్‌ ఇదేనా!

2 2టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ ‘106వ’ సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒక పాత్రలో ఆయన అఘోరాగా కనిపించనున్నారట. గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ఓ పాట పడుతున్న అని బాలయ్య తెలిపారు. దాంతో అభిమాలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భముగా ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లోగా మోనార్క్ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దినిపై క్లారిటీ రావలంటే.. జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu