HomeTelugu Trendingబాలయ్య సినిమాలో బోల్డ్‌ బ్యూటీ

బాలయ్య సినిమాలో బోల్డ్‌ బ్యూటీ

7 3
నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టయిల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. కాగా, లాక్‌డౌన్ కి ముందే.. ఈ చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హీరో బాలకృష్ణ మాత్రం మరికొన్నాళ్లు పోయాకనే ఈ షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశిఖన్నా, కేథరిన్ వంటి పేర్లు నిన్నటి వరకు వినిపించినా వారెవరూ ఫైనల్ కాలేదు. కాగా తాజాగా అమలాపాల్ ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత మెగా హీరోలు రామ్ చరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ‘ఆమె’ చిత్రంలో బోల్డ్‌గా నటించి సంచలనం సృష్టించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu