HomeTelugu Trendingభారీగా 'రూలర్' ప్రీ రిలీజ్‌ ఈవెంట్!

భారీగా ‘రూలర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్!

6 25నందమూరి బాలకృష్ణ హీరోగా .. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న చిత్రం ‘రూలర్’. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా సోనాల్ చౌహాన్ – వేదిక హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

విడుదల తేదీకి ఐదు రోజులముందు .. అంటే డిసెంబర్ 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగాలనే అభిప్రాయాన్ని బాలకృష్ణ వ్యక్తం చేయడంతో, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే వేదికను ఖరారు చేసి ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu