HomeTelugu NewsBalakrishna: ప్రచార ప్రారంభంలోనే.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు

Balakrishna: ప్రచార ప్రారంభంలోనే.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు

Balakrishna slapped fan in Balakrishna,kadiri,ap election,tdp,chandrababu

Balakrishna: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించి.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

అయితే, ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే బాలయ్య తన టెంపర్‌ చూపించాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి కూడా చేసుకున్నారు. బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు ఓ అభిమాని.. బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు.

గుమ్మిగూడి జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సమయంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ చేయి చేసుకున్నారు. ఇక నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

దీని కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న బాలయ్య.. ఆ తర్వాత తన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టన్నారు. కాగా, ఇప్పటికే బాలయ్య పలు సందర్భాల్లో తన ఫ్యాన్స్‌పై చేసుకున్నారు. సింపుల్‌ వచ్చి.. రిక్వెస్ట్‌గా సెల్ఫీ, ఫొటోలు అడిగితే కూల్‌గానే స్పందిస్తాడు బాలకృష్ణ.

అయితే ఎవరైనా తన దగ్గరకు వచ్చి అతిచేస్తే మాత్రం.. వెంటనే సీరియస్‌ అవుతాడు. అయితే సినిమాలు, ఆడియో ఫంక్షన్‌ల్లో అయితే పర్వలేదు. కానీ ఇక్కడ ఎన్నికల ప్రచారం. ప్రత్యర్ధులు ప్రతి క్షణం ఓ కంట మనల్ని కనిపెడుతునే ఉంటారు. ఇటువంటి చర్యలు ఇతర పార్టీ వాళ్లుకు ప్లస్‌ అవుతాయి. ప్రచారం ప్రారంభంలోనే ఇలా ఉంటే.. పూర్తయ్యే సరికి ఎలా ఉంటుందో. సో ఈ టైమ్‌లో బాలయ్య తన టెంపర్‌ని కొంచెం అదుపులో పెటుకుంటే బాగుంటుంది అనే కామెంట్స్‌ వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu