HomeTelugu Newsకాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు సినీ ప్రముఖుల ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు సినీ ప్రముఖుల ప్రశంసలు

10 19తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో కూడుకున్న ఓ అద్భుతమని అభిప్రాయపడ్డారు. నాగార్జున, రాజశేఖర్‌, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌, సుధీర్‌బాబు తదితరులు ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘నీరు జీవనాధారం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆల్‌ ది బెస్ట్‌. ఇది మానవ ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో కూడిన అద్భుతం’ అని నాగ్‌ ట్వీట్‌ చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది రైతుల కళ్ళలో ఆనంద బాష్పాలు చూస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకి ధన్యవాదాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు శుభారంభం సందర్భంగా తెలంగాణ రైతన్నలకు శుభాకాంక్షలు.

రాజశేఖర్‌: సవాలుతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి శుభాకాంక్షలు. ఆల్‌ ది బెస్ట్‌ సర్‌.

సుధీర్‌బాబు: కేసీఆర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఇంజినీరింగ్‌ వండర్‌ మొత్తం దేశానికి స్ఫూర్తిదాయకం.

రవితేజ: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌తో కూడిన ఓ అద్భుతం అనడంలో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్‌, కేటీఆర్‌కు శుభాకాంక్షలు. ప్రాజెక్టుకు ప్రాణం పోసిన మేధావులకు కూడా ఈ క్రెడిట్‌ వెళ్తుంది.

ప్రకాశ్‌రాజ్‌: ప్రకాశ్‌.. ‘ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్టు’ అని కేటీఆర్‌ నాతో అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డారు. ఇవాళ అది నిజమైంది. తెలంగాణకు శుభాకాంక్షలు. ముందుచూపుతో ఆలోచించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు‌.

రామ్‌: ఇది మనమంతా గర్వించదగ్గ సమయం. ఆంధ్రా నాదే.. తెలంగాణ నాదే..

రానా: కాళేశ్వరం ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. కేసీఆర్‌, కేటీఆర్‌కు శుభాకాంక్షలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu