HomeTelugu Trendingశ్యామ్‌సింగారాయ్‌: నాని నటనపై బాలకృష్ణ ప్రశంసలు

శ్యామ్‌సింగారాయ్‌: నాని నటనపై బాలకృష్ణ ప్రశంసలు

Balakrishna watched nani sh
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్నారు. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. ఇటేవలే పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు.

బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేశారు. సినిమా చూసిన బాలకృష్ణ నానిపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సినిమా చాలా బావుందని, నటన అద్భుతంగా చేసినట్లు తెలిపారని సమాచారం. ప్రస్తుతం ఈ బాలయ్యతో శ్యామ్ సింగరాయ్ బృందం కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24 న విడుదలై మంచిటాక్‌తో కలెక్షన్లను రాబడుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu