HomeTelugu Trendingమొదలైన మెగా డాటర్‌ వెబ్ సిరీస్

మొదలైన మెగా డాటర్‌ వెబ్ సిరీస్

2 10

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా ఓ వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయనున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. సుష్మితా ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ రోజు షూటింగ్ ప్రారంభమైన సందర్బంగా నిర్మాత శ్రీమతి సుష్మితా మాట్లాడుతూ… ” జీ 5 ఓటీటీ వేదిక మా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు” అని అన్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనాకు అవసరమైన భద్రతా చర్యలతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu