HomeTelugu Trendingమాస్‌ డైలాగులతో బాలయ్య రచ్చరచ్చ.. టీజర్‌

మాస్‌ డైలాగులతో బాలయ్య రచ్చరచ్చ.. టీజర్‌

11b
నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది.

64 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో నందమూరి అభిమానులు కోరుకునే మాస్‌ డైలాగులతో ఇరగదీశాడు బాలయ్య. వైట్‌ డ్రెస్‌, గుబురు మీసాలతో మాస్ లుక్‌లో కనిపించాడు బాలయ్య . ఆయన చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు, శత్రుగణాన్ని గాల్లోకి ఎగిరేసి కొట్టడం వంటి సీన్లు టీజర్‌లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే బరువు తగ్గినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. తమన్‌ సంగీతమందించిన ఈ చిత్రానికి రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu