HomeTelugu Trending(మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ

(మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ

14 1
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నటుడు నరేశ్‌ 41 రోజులపాటు సెలవు పెట్టడంతో మా ఉపాధ్యక్షుడిగా ఉన్న బెనర్జీ నియామకం జరిగింది. నిబంధనల ప్రకారం ‘మా’ కార్యనిర్వాహక, క్రమశిక్షణ కమిటీ బెనర్జీని ఎన్నుకుంది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్‌ కార్యాలయం పక్కనే ఉన్న ఫిల్మ్‌ఛాంబర్‌ హాల్లో సమావేశం నిర్వహించి బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్‌, జయసుధ, జీవితా రాజశేఖర్‌, అలీ, హేమ, రాజీవ్‌ కనకాల, శివ బాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కల్యాణి, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, సురేశ్‌ కొండేటి, అశోక్‌కుమార్‌, తనీశ్‌ పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu