HomeTelugu Trendingకంటతడి పెట్టిన బెనర్జీ

కంటతడి పెట్టిన బెనర్జీ

Banerjee emotional in front
మా ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు.. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్‌ రాజ్‌.. ఒక ప్యానెల్‌ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో ప్యానెల్‌ సభ్యులు లేకుండా.. ఒకే ప్యానెల్‌ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అందుకే రాజీనామా చేస్టున్నట్టు ప్రకటించారు. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బెనర్జీ మాట్లాడుతూ.. మోహన్‌ బాబు ఆయనను అరగంట పాటు బూతులు తిట్టారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్‌ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్‌ అయ్యారు. ‘ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్‌ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్‌ రోజు ఉదయమే వందల మందిలో మోహన్‌ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు. తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు. .

పోలింగ్ జరిగే చోట మోహన్‌బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్‌, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నాడు. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్‌ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి’ అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu